యాదాద్రి, వెలుగు: మున్సిపల్ ఎన్నికల విధులు జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు వార్డుల వారీగా దాఖలైన నామినేషన్లు, ఉపసంహరించున్న నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పార్టీలకు సంబంధించి ఫారం- ఏ, ఫారం- బీ సమర్పించారా అని ఆరా తీశారు.
ఎన్నికల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. విత్ డ్రా ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులు కేటాయించాలని ఆదేశించారు.
