యాదాద్రి జిల్లాలో ఉప్పొంగిన మూసీ.. సంగెంలో వరద ప్రవాహం.. కత్వ ‌‌వంతెనపై నుంచి వరద నీరు

యాదాద్రి జిల్లాలో ఉప్పొంగిన మూసీ.. సంగెంలో వరద ప్రవాహం.. కత్వ ‌‌వంతెనపై నుంచి వరద నీరు

యాదాద్రి, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని భీమలింగం కత్వ వద్ద లో-లెవల్‌‌‌‌ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. 

సోమవారం రాత్రి హైదరాబాద్‌‌‌‌లో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు మూసీలో చేరడంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో భీమలింగం కత్వ వద్ద వంతెనపై నుంచి నీరు పారుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కత్వకు ఇరువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరద ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.