యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో నిర్వహించిన ప్రజావాణిలో భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా 51 ఫిర్యాదులు రాగా, అందులో 32 భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. మిగిలిన వాటిలో హౌసింగ్, వెల్ఫేర్, మున్సిపాలిటీ, ల్యాండ్ సర్వే, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. కాగా, ఫిర్యాదులను కలెక్టర్ అనురాగ్ జయంతి స్వీకరించారు.
