పొలం బాట పట్టిన ట్రైనీ కలెక్టర్

పొలం బాట పట్టిన ట్రైనీ కలెక్టర్

యాదాద్రి భువ‌న‌గిని జిల్లా, వెలుగు : యాదాద్రి ట్రైనీ కలెక్ట‌ర్ గరిమా అగర్వాల్ పొలం బాట పట్టారు. ట్రైనింగ్ లో భాగంగా ఆమెను అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ కు అటాచ్ చేశారు. దీంతో రెండు రోజులుగా ఆ మె పలు మండలాల్లో పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బొమ్మలరామారం, తుర్కపల్లి, భువనగిరి మండలాల్లోని రుస్తాపూర్, చోక్లాతండా, పెద్దపర్వతాపూర్, రాంలింగంపల్లి, పెంచిక‌ల్ ప‌హోడ, చందుపట్ల, వీర‌వెల్లి గ్రామాల్లో జిల్లా వ్య‌వ‌సాయ అధికారి అనురాద‌తో క‌లిసి ప‌ర్య‌టించిన అగ‌ర్వాల్.. ఆయా గ్రామాల్లోని పంటల‌ను ప‌రిశీలించారు. ఈ సందర్భంగా పంటల సాగులో పాటించే మెళకువలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏడీఏ దేవ్ సింగ్, మండ‌ల రైతుబంధు స‌మితి క‌న్వీన‌ర్ కంచి మ‌ల్ల‌య్య‌, మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి, వీర‌వెల్లి ఎంపీటీసీ కంచి ల‌లిత‌, వీర‌వెల్లి ఏఈఓ శ్రీనివాస్, చందుప‌ట్ల ఏఈఓ మౌనిక , రైతులు కంచి న‌వీన్ త‌దిత‌రులు ఉన్నారు.

వీర‌వెల్లిలో పంట‌ల‌ను ప‌రిశీలిస్తున్న ట్రైనీ క‌లెక్ట‌ర్