మార్కెట్లోకి యమహా కొత్త బైక్

మార్కెట్లోకి యమహా కొత్త బైక్

ఢిల్లీ: యూత్ ఎక్కువగా ఇష్టపడే యమహా బైక్స్ లో కొత్త మోడల్ వచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం తెలిపిన సంస్థ ..మోడల్ బైక్ ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్‌ ను విడుదల చేశామని ..దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్‌ షోరూం ఢిల్లీ)గా నిర్ణయించిందని తెలిపింది ఇండియా యమహా. లిక్విడ్‌ కూల్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌ మిషన్‌, సింగిల్‌ ఛానల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, వేరియబుల్‌ వ్యాల్యూ ఆక్చుయేషన్‌ లాంటి ఫీచర్లత ఈ బైక్‌ ను తీసుకొచ్చింది యమహా.

ఎంటీ సిరీస్‌ లో యమహా ఇప్పటికే పలు మోడళ్లను తయారుచేసింది. అయితే భారత్‌ లో ఎంటీ-09 మోడల్‌ ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్‌ సేల్స్ కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్‌ లో ఇప్పుడు ఎంటీ-15 బైక్‌ ను తీసుకొచ్చింది. ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు సేల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రవీంద్ర సింగ్‌ తెలిపారు.