శాంతిస్తున్న యమునా నది..  అక్కడ 45 రోజుల పాటు మోస్తరు వర్షాలు

శాంతిస్తున్న యమునా నది..  అక్కడ 45 రోజుల పాటు మోస్తరు వర్షాలు

ఢిల్లీలోని యమునా నదిలో గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహోగ్ర రూపాన్ని సంతరించుకున్న యమునా నది శాంతిస్తున్నట్లు కనిపిస్తోంది. నది నీటి మట్టం ప్రతి గంటకు 5 సెంటీ మీటర్ల చొప్పున తగ్గుతోందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

జులై 16నాటికి పరిస్థితిలో గణనీయంగా మార్పు వస్తుందని వెల్లడించింది. జులై 15 మధ్యాహ్నానికి యమునా నీటి మట్టం 207.38 మీటర్లుగా ఉంది.  ఇది ప్రమాద హెచ్చరిక కంటే రెండు మీటర్లు ఎక్కువే.  అదే సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలని మాత్రం వరద వదలట్లేదు.  

రాబోయే 45 రోజుల పాటు దేశంలో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. దేశ రాజధానిలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్​ఎఫ్​, తదితర భద్రత బలగాలు మోహరించినా వరద ఉద్రితి తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకలు ఏర్పడుతున్నాయి. 

ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ వినయ్​ కుమార్​ సక్సెనా క్షేత్ర స్థాయిలో పబ్లిక్ ఇబ్బందులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ వరదల పై జులై 15 సాయంత్రం రివ్యూ చేయనున్నట్లు సమాచారం.