యాసంగి పంట 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు రూ. 8700 కోట్లు జమ

యాసంగి పంట 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు రూ. 8700 కోట్లు జమ

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు సివిల్​సప్లయ్స్​శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. మే 23 నాటికి  దాదాపు 7 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, వారి ఖాతాల్లో రూ.8,700 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్రంలోని 8,575 కొనుగోలు సెంటర్లలో ధాన్యం తరలింపునకు లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు కలిపి 13,200 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 38 లక్షల  టన్నుల దొడ్డు రకం, 12 లక్షల  టన్నుల సన్న రకం వడ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. కొనుగోళ్లలో సమస్యలుంటే 1967 హెల్ప్‌‌లైన్‌‌ను సంప్రదించాలని సూచించారు.