- కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్ టౌన్/కొత్తపల్లి: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఇందుకు కొనుగోలు సెంటర్లలో మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికపై మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రూ.2.73 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, 6.46లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తున్నామన్నారు.
జిల్లాలో ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై రివ్యూ చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌కు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకరించాలన్నారు.
అనంతరం కొత్తపల్లి మండలం సీతారాంపూర్‌లోని గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీలర్లు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఏడీసీపీ వెంకటరమణ, సివిల్ సప్లై ఆఫీసర్ నర్సింగారావు పాల్గొన్నారు.
