
బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు సర్వం సిద్దమైంది. ఈ సభకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. 15 లక్షల మందికి పైగా సభకు వచ్చారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. మేదరమెట్ల వైసీపీ జండాలతో రెపరెప లాడుతున్నాయి. విపక్షాల పొత్తు నేపథ్యంలో జగన్ కౌంటర్ ఎలా ఉండబోతుందని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ఎక్కువ మంది వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నా కల పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు జగన్. వైనాట్ 175 కాన్సెప్ట్ తో వై ఆకారంలో సభా వేదిక వద్ద ర్యాంప్ ఏర్పాటు చేశారు.