తెలంగాణలోకి నైరుతి ... అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలోకి నైరుతి ... అన్ని జిల్లాలకు ఎల్లో  అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు:  నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలో ప్రవేశించాయి. ఈ ప్రభావంతో నల్గొండ, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, కొత్తగూడెం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో నైరుతి పవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది. రాష్ట్రమంతా నాలుగు రోజులకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

రేపు ఈ జిల్లాల్లో..

నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది.