సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా ఉత్సవ్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో యోగా ఉత్సవ్
  • భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • పరేడ్ గ్రౌండ్ లో ఆసనాలు వేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి

సికింద్రాబాద్: యోగా… భారతీయ సంస్కృతికి ప్రతీక అన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. యోగా దినోత్సవం నిర్వహిస్తున్న ఆయుష్, సాంస్కృతిక శాఖలను అభినందించారు.  ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యోగా డే లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తర్వాత ప్రజలతో కలిసి ఆసనాలు వేశారు వెంకయ్య, ఇతర నేతలు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, బ్యాట్మింటన్ ప్లేయర్ పీవీసింధు, సినీ హీరో అడవి శేష్ యోగా డేలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిధులను శాలువా, మెమొంటోతో సత్కరించారు కిషన్ రెడ్డి.