యోగా మహోత్సవ్... 25 రోజుల పాటు కౌంట్ డౌన్ వేడుకలు

యోగా మహోత్సవ్... 25 రోజుల పాటు కౌంట్ డౌన్ వేడుకలు

యోగా మహోత్సవ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 25 రోజులపాటు కౌంట్ డౌన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుల, మతాలకు అతీతంగా యోగా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. రేపు(మే 27) ఉదయం పూట వేలమంది యోగా గురువుల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 


ప్రపంచంలోనే ఒకే దగ్గర జరుగుతున్న యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఇప్పుడు హైదరాబాద్ లో జరపడానికి అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, రాష్ట్రమంత్రులు, సినిమా ఆర్టిస్ట్, క్రీడాకారులను కూడా ఆహ్వానించామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  పిలుపునిచ్చారు.