
యోగాసన.. ఇక ఆట
కాంపిటీటివ్ స్పోర్ట్‌గా గుర్తించిన స్పోర్ట్స్ మినిస్ట్రీ
న్యూఢిల్లీ: యోగాసనకు కాంపిటీటివ్ స్పోర్ట్‌గా అధికారిక గుర్తింపు లభించింది. ఈ మేరకు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో, ఈ ఆటకు గవర్నమెంట్ ఫండింగ్ లభించనుంది. ‘యోగాసన అనేది చాలా కాలం నుంచి ఒక ఆటగా ఉంది. ఇప్పుడు కాంపిటీటివ్ స్పోర్ట్‌గా అధికారికంగా గుర్తిస్తున్నాం. దీనికి మంచి ఫ్యూచర్ ఉందని భావిస్తున్నా’ అని స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరిలో నేషనల్ చాంపియన్‌షిప్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్, రిథమిక్, ఇండివిడ్యువల్–టీమ్ ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించాలని ప్రతిపాదించారు.
For More News..