యోగి హైదరాబాద్ పర్యటన రేపటికి వాయిదా

యోగి హైదరాబాద్ పర్యటన రేపటికి వాయిదా

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఇవాళ హైదరాబాద్ రావాల్సిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. కొన్ని కారణాల వల్ల యోగి పర్యటన రద్దు అయినట్లుగా ఆయన వెల్లడించారు. రేపు(జూలై 3)న యోగి భాగ్యనగరానికి రానున్నారని రాజాసింగ్ తెలిపారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం యోగి ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర బీజేపీ నేతలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంది. ఈ మేరకు చార్మినార్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. కానీ చివరి నిమిషంలో యోగి పర్యటన రేపటికి వాయిదా పడింది.