భారత్‌కు నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ కావాలె

భారత్‌కు నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ కావాలె

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ చతికిలపడింది. న్యూజిలాండ్ చేతిలో ఓడి ప్రతిష్టాత్మక కప్‌ను చేజార్చుకుంది. ఐసీసీ టోర్నీల్లో కీలక సమయాల్లో టీమిండియా తడబడుతుండటంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయి. అదే టైమ్‌లో జట్టు కూర్పు మీద కూడా ప్రశ్నలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా లాంటి పేస్ ఆల్‌‌రౌండర్ జట్టులో లేని లోటు కనిపిస్తోందని పలువురు సీనియర్లు అంటున్నారు. మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘టీమిండియాకు నిఖార్సైన బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. అయితే ఇందుకు హార్దిక్ పాండ్యా మీదే ఆధారపడి ఉండలేం. అన్ని ఫార్మాట్‌ల్లో అతడు బౌలింగ్ చేయగలడో లేదో కూడా చెప్పలేం. కాబట్టి శార్దూల్ ఠాకూర్, విజయ్ శంకర్, శివమ్ దూబే లాంటి ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వాలి. వారిని మంచి ఆల్‌రౌండర్లుగా తీర్చిదిద్దాలి’ అని శరణ్‌దీప్ సింగ్ సూచించారు.