ఎవడీడు.. హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్స్.. పిచ్చేక్కిస్తున్నాడు..

ఎవడీడు.. హైదరాబాద్ రోడ్లపై బైక్ స్టంట్స్.. పిచ్చేక్కిస్తున్నాడు..

ఎవడయ్యా వీడు.. హైదరాబాద్ రోడ్లు అనుకుంటున్నాడా లేక ఎఫ్ 1 రేసులు అనుకుంటున్నాడా.. అదేమన్నా స్పోర్ట్స్ బైకా అంటే అదీ కాదు.. మామూలు స్కూటీ.. దానిపై చేస్తున్న స్టంట్స్ మామూలుగా ఉండటం లేదు.. హాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సినిమాల్లో బైక్స్ స్టంట్స్ ను.. వీడెవడో కానీ మన రోడ్లపై బీభత్సంగా చేసేస్తున్నాడు.. సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఈ డీటెయిల్స్ మీ కోసం..

50, 60 స్పీడ్ లో.. ఫ్రంట్ టైర్ పైకి లేపి.. బ్యాక్ టైర్ బండి డ్రైవ్ చేస్తూ.. హ్యాండిల్ పై కాళ్లు పెడుతూ.. యమా స్పీడ్ లో వీడు చేస్తున్న స్టంట్స్ మామూలుగా లేవు.. సిటీలో అక్కడా ఇక్కాడా అని లేదు.. ఐకాన్ ప్లేసెస్ అన్నింటి దగ్గర.. తన బైక్ స్టంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. 

కొత్త సెక్రటేరియట్ ఎదుట.. అర్థరాత్రి స్టంట్స్ చేస్తున్న వీడియో ఒకటి ఉండగా.. హైటెక్ సిటీ ఏరియాలో ఓ వీడియో పోస్టు చేశాడు.. అదే విధంగా పట్టపగలు.. నిత్యం రద్దీగా ఉండే టోలిచౌకీ, గచ్చిబౌలి మధ్యలో ఉన్న కొత్త ప్లైఓవర్ పైనా బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు ఈ కుర్రోడు. ఇదేమన్నా పెద్ద బైకా అంటే అదీ కాదు.. స్కూటీ.. దీనిపైనే తన టాలెంట్ మొత్తం చూపిస్తున్నాడు.

ఇదే సమయంలో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రోడ్ సేఫ్టీ లేదా.. ఇంత బహిరంగంగానే పోస్టులు పెడుతుంటే ట్రాఫిక్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు.. ఇలాంటి వాళ్ల వల్ల రోడ్డుపై వెళ్లే మిగతా వాళ్లకు ప్రమాదం జరగదా అని ప్రశ్నిస్తున్నారు. బండి నెంబర్, ఇన్ స్ట్రా ఐడీలను ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. ఇలాంటి స్టంట్స్ ఏ అడవుల్లోనో చేసుకోమనండి.. సిటీ మధ్యలో చేయటం వల్ల ప్రమాదం కదా అంటున్నారు. 

మరికొందరు అయితే కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయండి.. అనవసరంగా పోలీసులకు కంప్లయింట్ చేసి ఎందుకు అతనిపై కేసులు పెట్టిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఎటూ చేతకాదు.. చేయలేరు.. యంగ్ టాలెంట్ ను ఇలా తొక్కేస్తే మీకు ఏం వస్తుందంటూ మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్టంట్స్ వల్ల ఇతరులకు అయితే ఇబ్బంది.. ప్రమాదం అనేది మాత్రం వాస్తవం కదా.. దీనిపై ట్రాఫిక్ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి...