బెట్టింగ్ యాప్ లో రూ. 25 లక్షలు లాస్.. జగిత్యాలలో యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్ యాప్ లో  రూ. 25 లక్షలు లాస్.. జగిత్యాలలో యువకుడు ఆత్మహత్య

బెట్టింగ్​ యాప్స్​ దందా..  ఇప్పుడు ఏ గల్లీలో చూసినా, ఏ అడ్డాలో చూసినా.. యువత వీటి చుట్టే తిరుగుతున్నారు. సెల్​ఫోన్​లో యాప్స్​ డౌన్​లోడ్​ చేసుకొని.. బెట్టింగ్​ కాయడం, గేమ్స్​ ఆడడంపైనే గంటలకు గంటలు టైమ్​ వెచ్చిస్తున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్​ యాప్స్​వల్ల అప్పలుపాలై ఆత్మహత్య చేసుకుని కుటుంబాలను ఆగం చేస్తున్నారు. ఫిబ్రవరి 26న జగిత్యాల జిల్లాలో బెట్టింగ్ యాప్ కు ఓ యువకుడు బలయ్యాడు. 

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ కు చెందిన పాలైన మహేశ్ అనే గీతాకార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.  బెట్టింగ్ యాప్ లో 25 లక్షలు  ఇన్వెస్ట్ చేశాడు.పెట్టిన డబ్బులు రాకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. మహేష్ కు భార్యా  ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 బెటింగ్ యాప్ ను అరికట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గ్రామస్థులు. ఈ విషయం తెలుసుకుని మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.