సిద్దిపేట యువకుడు కనుగొన్న బ్యాటరీ సైకిల్ ప్రత్యేకత..

సిద్దిపేట యువకుడు కనుగొన్న బ్యాటరీ సైకిల్ ప్రత్యేకత..

సిద్దిపేటకు చెందిన మోసిన్ అనే యువకుడికి లాక్ డౌన్  సమయంలో ఓ ఆలోచన వచ్చింది. పెట్రోల్  భారం తగ్గించుకునేందుకు ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయాలని అనుకున్నాడు. పాత సామాను దుకాణాలకు వెళ్లి, మోటార్ తో పాటు  సైకిల్  రీమ్, ఒక సెన్సార్, హ్యాండిల్ కొన్నాడు. వీటన్నిటినీ ఒక పాత సైకిల్ కు అమర్చాడు. తన షాప్ లో ఉన్న రెండు 32 యంప్స్ బ్యాటరీలను  సైకిల్ పైడీల్ మధ్యన ఫిట్ చేశాడు. సెన్సార్ బోర్డ్  ను మోటార్ బ్యాటరీతో కనెక్ట్  చేశాడు. దీంతో ఇలా ఎలక్ట్రానిక్  సైకిల్ తయారయింది. 

బ్యాటరీ సహాయంతో నడిచే ఈ సైకిల్ పై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు.  బ్యాటరీని మూడు గంటలపాటు  ఛార్జ్ చేస్తే, 40 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ సైకిల్ ప్రత్యేకంగా రివర్స్  కూడా వెళ్తుంది. ఈ సైకిల్ కి రెండు కీస్   ఉంటాయి. బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా  సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ తయారు చేయడానికి 8000 ఖర్చయిందంటున్నాడు మోసిన్.