ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ రాంనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీ గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి (సెప్టెంబర్ 05) నిర్వహించిన గణేశ్ఆగమనం శోభాయాత్రలో భారీ డీజే సౌండ్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ స్థానిక యువకుడు బద్రీనాథ్(20) అకస్మాత్తుగా కిందపడిపోయాడు.
అతన్ని కొందరు పక్కనే మూసి ఉన్న దుకాణాల ముందు పడేశారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని అంబులెన్స్‌లో గాంధీ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు, త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ మండప ఏర్పాట్లు చేస్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డాడు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఇంత జరిగినా నిర్వాహకులపై ముషీరాబాద్, వారాసిగూడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
