మూసి ప్రాజెక్టులో ఆడుకుంటూ జారిపడి యువకుడి మృతి

మూసి ప్రాజెక్టులో ఆడుకుంటూ జారిపడి యువకుడి మృతి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. నల్గొండ జిల్లాలో కూడా వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టు కూడా వరద నీటితో నిండి ప్రవహిస్తుంది. సాగర్ గేట్లు ఎత్తడంతో మూసి కూడా నీటితో నిండిపోయింది. దాంతో మూసి ప్రాజెక్టును చూడటానికి ప్రజలు వస్తున్నారు. నకిరేకల్ పట్టణానికి చెందిన పల్లా సాయి అనే 22 సంవత్సరాల యువకుడు ప్రాజెక్టును చూడటానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రాజెక్టు కింద సరదాగా స్నేహితులతో ఆడుకుంటుండగా.. జారి రాళ్ల మధ్యలో పడ్డాడు. దాంతో తీవ్రగాయాలై సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు సాయి గుండె మీద రుద్దుతూ కాపాడటానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండాపోయింది. ఈ ఘటనను మొత్తం అక్కడే బ్రిడ్జీ మీద ఉన్న పర్యాటకులు వీడియో తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

ఏపీలో కొత్తగా 7,895 కరోనా కేసులు.. 93 మంది మృతి

సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ కు రూ. 1.5 కోట్ల కరెంట్ బిల్లు

మెగాస్టార్ కు బైక్ గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు