జీడిమెట్లలో ఇష్టం లేని పెండ్లి చేశారని యువతి ఆత్మహత్య

జీడిమెట్లలో ఇష్టం లేని పెండ్లి చేశారని యువతి ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: కుటుంబసభ్యులు ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి అలియాస్​ పూజ(25)కు గతేడాది డిసెంబర్​14న హరికృష్ణతో వివాహం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దంపతులు సుభాష్​నగర్ కు వచ్చి, ఓ అపార్ట్​మెంట్ లో ఐదో అంతస్తులోని ఫ్లాట్​లో ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్​ కంపనీలో అకౌంటెంట్. కాగా, లక్ష్మికి ఈ వివాహం ఇష్టం లేదు. 

పెళ్లయినప్పటి నుంచి దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆమె తమ ఫ్లాట్​లోని కిటికీలో నుంచి దూకి, ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్​కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.