
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. వైద్యం వికటించి యువతి మృతి చెందింది. అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది నికిత అనే యువతి. చికిత్స పొందుతూ ఆగస్టు 16న మృతి చెందింది.
అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నికిత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నికిత మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా ఆస్పత్రి యాజమాన్యం గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు.