పోలీస్ జాబ్స్: ఇందిరాపార్క్ దగ్గర యూత్ కాంగ్రెస్ సమర దీక్ష

పోలీస్ జాబ్స్: ఇందిరాపార్క్ దగ్గర యూత్ కాంగ్రెస్ సమర దీక్ష

పోలీస్ నియామకాల్లో ఏర్పడిన గందరగోళంపై ఇందిరాపార్క్ దగ్గర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతలు సమర దీక్ష చేస్తున్నారు. దీక్షలో పోలీస్ జాబ్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ తప్పిదాలతో చాలా మంది చనిపోయారని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేనరెడ్డి ఆరోపించారు.

ఈవెంట్స్ లో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా సహించబోనన్న ఎమ్మెల్సీ కవితకు  తమ బాధలు కనిపిస్తలేవా అని అభ్యర్థులు ప్రశ్నించారు.  తెలంగాణలో చదువుకున్న విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. 7 మల్టీపుల్ ప్రశ్నలకు  హైకోర్ట్ ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 600 మీటర్ల రన్నింగ్ పెట్టిన తర్వాత మళ్లీ లాంగ్ జంప్ పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.