కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత చేస్తున్న పోరాటం ఫలించింది. యువత ప్రధాన డిమాండ్లు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. మొదటి డిమాండ్ గా నీట్ పేపర్ లీక్ లకు బాధత్య వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక మిగిలింది రెండు డిమాండ్లు. అవి నేరవేరేవర కు ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం కాక్రోచ్ పార్టీ ప్రతినిధులను చర్చలకు పిలిచింది కేంద్ర ప్రభుత్వం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ..భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం.. ఆయన రాజీనామా చేశారు. కానీ మాకు మరో రెండు డిమాండ్లు ఉన్నాయి. రెండు డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత నెల రోజులుగా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత,విద్యార్థులు డిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దీక్ష చేపట్టి ఆందోళనలు చేశారు. కేంద్రప్రభుత్వాన్ని మూడు డిమాండ్లు కోరారు.
1.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనాచేయాలి
2.నీట్ పేపర్ లీకులతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
3.కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి..
ఈ మూడు డిమాండ్లను యువత కేంద్ర ప్రభుత్వం ముందుంచింది మొదటిది నెరవేరింది.. మరో రెండో డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
#WATCH | Delhi: On the resignation of Union education minister Dharmendra Pradhan, Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "There's no need to be afraid. This is democracy. He has resigned, but we have two more demands. We won't go like this. Dharmendra… pic.twitter.com/K8xiZ0NInO
— ANI (@ANI) July 25, 2026
ఇదిలా ఉంటే.. తమ డిమాండ్లపై మరోసారి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. శనివారం సాయంత్రం 3.30 గంటల తర్వాలకు చర్చలకు పిలిచారని కాక్రోచ్ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ చెప్పారు.
గత నెల రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా యువత చేస్తున్న పోరాటానికి కేంద్రం తలొంచింది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా యువత సంబురాలు చేసుకుంది.
