ఇదేం దోస్తానంరా నాయనా: స్నేహితుడిని హోలి నిప్పుల్లో నెట్టారు

ఇదేం దోస్తానంరా నాయనా: స్నేహితుడిని హోలి నిప్పుల్లో నెట్టారు

ఆపదలో ఉన్న వాడిని ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు కదా.. ఈ మధ్య కాలంలో స్నేహానికి అర్థం మారుతోంది. వింతచేష్టలుతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెలబ్రేషన్స్ పేరుతో కొట్టడం, విపరీతంగా హింసించడం జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఢిల్లీలో జరిగింది. హోలీ సంబరాల పేరుతో కొంతమంది గుంపుగా స్నేహితుడిని మంటల్లోకి నెట్టారు. హోలీ పండుగ సందర్భంగా జరిగిన ఈ ఇన్సెడెంట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

గ్రేటర్ నోయిడాలో సోమవారం ఈ ఘటన జరిగింది. సోమవారం (మార్చి 25) జరిగిన హోలీ వేడుకల్లో కొందరు యువకులు తోటి స్నేహితుడిపై  దారుణానికి పాల్పడ్డారు..హోలీ దహనం చేయగా మిగిలిన నిప్పుల్లో తోసేశారు. నిప్పులు కాలడంతో అతడు అప్రమత్తమై బయటపడ్డాడు.. అప్పడికే అతడి పాదాలు కాలిపోయాయి. దీంతో ఎంజాయ్ ఫుల్ మూవ్ మెంట్ అంతా ఒక్కసారిగా ప్రమాదంలో పడింది.  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.   

ఇదే విషయంపై యూపీ పోలీసులు తీరును నెటిజన్లు విమర్శిస్తున్నారు. పోలీసులు ఈ చర్యలను లైట్ తీసుకున్నారని.. స్నేహితులంతా కలిసి హోలీ ఎంజాయ్ చేస్తూ.. హోలీకా దహనం అయిపోయిన తర్వాత మిగిలిన బూడిదలో అతడు పడ్డాడని.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్నారు.. 

Also Read:బైక్ పైనే ల్యాప్ ట్యాప్ తో మీటింగ్ కు అటెండ్

అయితే విషయంపై నెటిజన్లు మాత్రం చాలా పోలీసులపై సీరియస్ అయ్యారు. డీసీపీ సర్ మీరు ఈ వీడియో అబద్దం అని నిరూపించగలరా అని ప్రశ్నించారు. నలుగురైదుగురు కలిసి ఓ వ్యక్తిని మంటల్లో తోసేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదని క్వశ్చన్ చేశారు మరో నెటిజన్.  ఏదీ ఏమైనా స్నేహితుడైనా..ఇతరులైన మంటల్లోకి నెట్టడం బాధాకరం.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటున్నారు నెటిజన్లు.