బాబోయ్ ఉద్యోగుల కష్టాలు : బైక్ పైనే ల్యాప్ ట్యాప్ తో మీటింగ్ కు అటెండ్

బాబోయ్ ఉద్యోగుల కష్టాలు : బైక్ పైనే ల్యాప్ ట్యాప్ తో మీటింగ్ కు అటెండ్

ఈ రోజుల్లో ఉద్యోగుల కష్టాలు మామూల్గ లేవు. పెరుగుతున్న కాంపిటేషన్స్ వల్ల జాబ్ కోసం అహర్నిశలు చెమటోడ్చాల్సి వస్తోంది. మిగతా ఉద్యోగులతో పోటీపడుతూ..ఉద్యోగాన్ని కాపాడుకోవాలి.. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. మీటింగ్ లు, వీడియో కాన్ఫరెన్స్ లు..జూమ్ మీటింగ్ లు ఇలా చెప్పుకుంటే పోతే జాబ్ అంటేనే పెద్ద తలనొప్పిగా మారింది. జాబ్ కావాలంటే కష్టపడాల్సిందే. 

లేటెస్ట్ గా బెంగళూరులో   బైక్ పై ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ఓపెన్ చేసి మీటింగ్ కు హాజరయ్యాడు.  ఓ ఉద్యోగి  తన మోకాళ్లపై ల్యాప్ టాప్ ఆన్ చేసి జూమ్ మీటింగ్ కు అటెండ్ కాగా.. మరో చేతితో  స్కూటర్ ను నడుపుతున్నాడు.  ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్  వామ్మో జాబంటే ఇన్ని కష్టాలా? అని కామెంట్ చేస్తున్నారు. కొందరేమో.. జాబ్ అంటే ఇంతేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 అయితే  కొందరు వినియోగదారులు రోడ్డు సేఫ్టీ గురించి.. పని ఒత్తిడిపై గురించి కామెంట్ చేశారు. కొందరేమో ఈ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం వెతుక్కోవాలని సూచిస్తున్నారు. ఐటీ కంపెనీలో  పనిచేయాలంటే వారానికి 70 గంటలు పనిచేయాలని.. అందుకే అతను కష్టపడుతున్నాడని మరి కొందరు కామెంట్ చేశారు.