Budget 2026: బడ్జెట్ వేళ నష్టాలతో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్లు..!

Budget 2026: బడ్జెట్ వేళ నష్టాలతో స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్లు..!

Budget Trading: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026న 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఆమె బడ్జెట్ ప్రసంగానికి ఉపయోగించే ట్యాబ్ తీసుకుని కర్తవ్య భవన్ చేరుకున్నారు. దీనికి ముందు అధికారులతో కూడా సమావేశం అయ్యారు. ఉదయం 11 గంటలకు ఆమె లోక్ సభలో కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించనున్నారు. అయితే ఈ క్రమంలో ప్రత్యేకంగా ఆదివారం రోజున ట్రేడింగ్ కోసం తెరవబడిన దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి. 

బడ్జెట్ స్పెషల్ ట్రేడింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ స్టార్ట్ చేయగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 44 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్ మెుదలు పెట్టింది. అయితే ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో నిఫ్టీ 7 పాయింట్ లాభంతో కొనసాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు మాత్రం నష్టాల్లోనే ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ స్టాక్స్ నష్టాల్లో ముందుకెళ్తున్నాయి. ఇదే క్రమంలో రూపాయి మారకు విలువ కూడా ఒత్తిడిలో కొనసాగుతున్నాయి.