క్రీడల అభివృద్ధి కోసం ఖేలో ఇండియా మిషన్
- ఉద్యోగాలు కల్పించడం, నైపుణ్యాలను పెంపొందించడం..
- అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడం లక్ష్యం
- వచ్చే పదేళ్లలో క్రీడాశాఖను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం
భారత్లో ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లు:
- ముంబై-పూణె
- హైదరాబాద్-బెంగళూరు
- హైదరాబాద్-చెన్నై
- బెంగళూరు-చెన్నై
- ఢిల్లీ-వారణాసి
- వారణాసి-సిలిగురి
- యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు
- కొత్తగా వైద్య రంగంలో AHP (Allied Health Professional) కోర్సులు
- వైద్య సంరక్షణ అందించే వారికి ప్రత్యేక శిక్షణ
- మెడికల్ వ్యాల్యూ టూరిజం కోసం ప్రత్యేక హబ్స్
- బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్.. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
(280 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్.. 60 పాయింట్లకు పైగా లాభాల్లో నిఫ్టీ)
- 21 శాతాబ్దం టెక్నాలజీదే
AI మిషన్కు ప్రాధాన్యం
హై లెవల్ బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటు
AI తో విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే ప్రణాళికలు
- దేశంలో కొత్తగా 3 ఆయుర్వేద హాస్పిటల్స్ ఏర్పాటు
- ఆయుష్ కేంద్రాల అప్గ్రేడేషన్
- సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్ నగర్లో పరిశోధన కేంద్రం ఏర్పాటు
- ప్రైవేట్ రంగంలో పశు వైద్య, డయాగ్నస్టిక్స్ ఏర్పాటకు ప్రోత్సాహం
- దేశంలోని టైర్-2, టైర్-3 సిటీల కోసం రూ.5 వేల కోట్ల కేటాయింపు
- కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్కు రూ.10 వేల కోట్లు
- హైదరాబాద్కు 3 సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్లు
(హైదరాబాద్-చెన్నై, పూణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హై హైస్పీడ్ రైల్వే)
- బయో ఫార్మా శక్తి పథకం
- రాబోయే 5 ఏళ్లల్లో 10 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
- క్యాన్సర్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు వ్యయం
- బయో ఫార్మా శక్తి కింద ఆరోగ్య భారతం దిశగా చర్యలు
- ఖాదీ సెక్టార్ కోసం మహాత్మగాంధీ స్వరాజ్ స్కీం
- వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 20 జలమార్గాల అభివృద్ధి
- వారణాసి, పాట్నాలో షిప్ రిపేరింగ్ సెంటర్ల ఏర్పాటు
- కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు
- బెంగాల్ నుంచి గుజరాత్ వరకు కారిడార్ ఏర్పాటు
- MSME లకు రూ.10 వేల కోట్లతో గ్రోత్ ఫండ్
- రూ.2 వేల కోట్లతో MSME లకు క్రెడిట్ గ్యారంటీ స్కీం
- 2 వందల పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత
- కొత్త మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు
- దేశంలో టెక్స్ టైల్స్ రంగం అభివృద్ధి కోసం కొత్త పథకాలు
- త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం
- ఇండియా సెమీ కండక్టర్ మిషన్కు భారీగా నిధుల కేటాయింపులు
- తమిళనాడు, కేరళ, ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్
- ప్రస్తుతం ఉన్న NIPERs ఆధునీకరణ
- దేశంలో కొత్తగా 3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్లు (NIPER)
- భారత్లో 2 హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
- దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు
- మూడు కర్తవ్యాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి
- 1.సమ్మిళిత ఆర్థిక వృద్ధి
- 2.వృద్ధిలో ప్రజలందరి భాగస్వామ్యం
- 3. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్
- 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం
- గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం
- వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం
- ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుని సంస్కరణలను కొనసాగిస్తున్నాం
- అనిశ్చిత పరిస్థితుల్లోనూ సాఫీగా ముందుకెళుతున్నాం
- భారత్ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతోంది
- 2026-27 బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్
- లోక్ సభలో మొదలైన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం
- బడ్జెట్ 2026-27: పార్లమెంట్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
- ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- బడ్జెట్లోని కీలక అంశాలను రాష్ట్రపతికి వివరించిన కేంద్ర ఆర్థిక మంత్రి
- బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందజేసిన నిర్మల
- నిర్మలకు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- రాష్ట్రపతిని కలిసిన అనంతరం పార్లమెంట్ చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- ఆదివారం 9వ సారి బడ్జెట్ స్పీచ్ ఇవ్వనున్న నిర్మలా సీతారామన్
- ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్తో సహా ఇప్పటివరకూ వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
- 2019లో మొదటిసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక 2019లో ఆర్థిక మంత్రిగా నిర్మల బాధ్యతలు
- ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బడ్జెట్ ప్రసంగం దాదాపు గంట, గంటన్నర సేపు ఉండే అవకాశం
- దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఒరవడికి నిర్మల శ్రీకారం
- వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కు దక్కనున్న రికార్డు
- 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులుగా మూడో స్థానంలో ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధికంగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రెండో స్థానంలో పి. చిదంబరం
- కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డ్
- పార్లమెంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2026–27
