ఇదే నా చివరి మీటింగ్..జీహెచ్ఎంసీ మేయర్ ఎమోషనల్ స్పీచ్

ఇదే నా చివరి మీటింగ్..జీహెచ్ఎంసీ మేయర్ ఎమోషనల్ స్పీచ్

ఐదేళ్ల పదవి కాలంతో హైదరాబాద్ నగర అభివృద్ధికి తనవంతు కృషి చేశాననన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.  ఉద్యోగులు ,సిబ్బంది,అధికారులు కలిసి కట్టుగా పనిచేశారని చెప్పారు.  ఐదేళ్లు కాలం  నగర నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు,రివార్డులు వచ్చాయన్నారు. మేయర పదవి కాలం ముగిసిన తన బాధ్యత మరువనని జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ భావోధ్వేగానిక గురయ్యారు విజయలక్ష్మి.

ఫిబ్రవరి  10 తో   జీహెచ్ఎంసి పాలక మండలి పదవి కాలం ముగియనుంది. ఇవాళ జరుగుతోన్న జీహెచ్ఎంసి పాలక మండలికి ఆఖరి కౌన్సిల్ సమావేశం. ఈ క్రమంలో 2026 -27  జీహెచ్ఎంసి బడ్జెట్ కు   జీహెచ్ఎంసి కౌన్సిల్ ఆమోదం తెలపనుంది.