సరైన బులెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వచ్చు కదా.. జగన్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

సరైన బులెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వచ్చు కదా..  జగన్ పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

భద్రత కుదింపుపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ ( ఆగస్టు 8, 2024 ) విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ కు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సరిగా పని చేయటం లేదని జగన్‌ లాయర్‌ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ప్రశ్నించగా... బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇంటెలిజెన్స్‌దని ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు.

జగన్‌కు మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, జామర్‌ ఇవ్వొచ్చు కదా అని అడిగిన న్యాయమూర్తి ప్రశ్నించారు. వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామని తెలిపారు అడ్వకేట్ జనరల్. జగన్ కు జెడ్ ప్లస్ భద్రతా కొనసాగించాలని, ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ కు ప్రాణహాని ఉందని తెలిపారు లాయర్. చట్టప్రకారం ఇవ్వాల్సిన బాధ్యతను జగన్ కు ఇస్తున్నామని తెలిపింది ప్రభుత్వం. 

మాజీ సీఎంలకు ఎలాంటి భద్రత ఉంటుందో తెలపాలని కోర్టు ప్రశ్నించగా అలాంటి పాలసీ ఏమీ లేదని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.