
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగుల సమస్య, టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై ఉమ్మడిగా పోరాడుదామని ప్రతిపక్ష పార్టీలను వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల కోరారు. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్లు బండి సంజయ్, రేవంత్ రెడ్డికి శనివారం ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆమె పేర్కొన్నారు. పేపర్ లీక్ అంశంపై ప్రగతిభవన్ మార్చ్ కు పిలుపునిద్దామని.. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని కోరినట్లు తెలిపారు.
ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారని, త్వరలో సమావేశం అవుదామని చెప్పారని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని, దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిపారు.