కేసీఅర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

కేసీఅర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. తాగి ఫామ్ హౌజ్లో పడుకోవడమే తెలుసని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవ చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టికి 113వ రోజు చేరింది. ఈ యాత్రలో భాగంగా ఆమె హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలం పరెడ్డి గూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ సంందర్భంగా గ్రామస్థులతో వైఎస్ షర్మిల ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు.ఏ ఒక్క రకంగా కూడా రాష్ట్రం బాగు పడలేదు. ఒక్క పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదని షర్మిల విమర్శించారు. కేసీఆర్ కు తాగి ఫామ్ హౌజ్ లో పడుకోవడం తెలుసు అని ఆమె ఎద్దేవ చేశారు. 

కేసీఆర్ ప్రాణాలకు చాలా విలువ ఉందాట.. రైతులు, నిరుద్యోగుల ప్రాణాలకు విలువ లేదట అని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల అవినీతి అంటే దిమ్మ తిరిగిపోతుందని అశ్చర్యపోయారు షర్మిల. రాష్ట్రం మద్యం అమ్మకాల్లో తప్పా ఎక్కడ అభివృద్ధి లేదు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి బరోసా లేదు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని.. వైఎస్సార్ సంక్షేమం కోసమే రాజన్న బిడ్డ పార్టీ పెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తేవడం కోసమే ఈ పార్టీ ఉందన్నారు. వైఎస్సార్ సుపరిపాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అవతరించిందని షర్మిల పేర్కొన్నారు.