Cricket World Cup 2023: దేశం కోసం క్యాన్సర్ ని లెక్క చేయలేదు.. నువ్వు డెంగ్యూతో పోరాడలేవా: యువరాజ్ సింగ్

Cricket World Cup 2023: దేశం కోసం క్యాన్సర్ ని లెక్క చేయలేదు.. నువ్వు డెంగ్యూతో పోరాడలేవా: యువరాజ్ సింగ్

సాధారణంగా డెంగ్యూలాంటి హై ఫీవర్ వచ్చినప్పుడూ కోలుకోవడం చాలా కష్టం. కనీసం నెల రోజులైనా సమయం పడుతుంది. కానీ టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ మాత్రం చాలా త్వరగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ కి ముందు డెంగ్యూ బారిన పడి తొలి రెండు మ్యాచులకు దూరమైన ఈ  పంజాబ్ ప్లేయర్..పాకిస్థాన్ మ్యాచ్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గిల్ ఇంత త్వరగా కోలుకోవడానికి యువరాజ్ సింగ్ కారణం అని తెలుస్తుంది.
 
ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ గిల్ తో మాట్లాడిన విషయాలను గురించి చెప్పుకొచ్చాడు. ANI తో మాట్లాడుతూ.. "2011 ప్రపంచ కప్‌లో క్యాన్సర్‌తో ఎలా పోరాడానో చెప్పి గిల్‌ను నేను మోటివేట్ చేసాను. నా పరిస్థితి ఏదైనా నేను జట్టులో చేరడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడిని. గిల్ కూడా డెంగ్యూ బారిన పడ్డాడు. దీని నుంచి కోలుకోవడం అంతా సామాన్యమైన విషయం కాదు. కానీ గిల్ కోలుకొని నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడితే చూడాలని భావిస్తున్నా". అని తెలిపాడు.

Also Read :- నాటౌట్ అయినా అవుట్ ఇచ్చేసారు
 

24 ఏళ్ళ గిల్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్, ఆసియా కప్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేయడంతో పాటు, వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డ్ గిల్ పేరిట ఉంది. వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీలో గిల్ ఆడటం టీమిండియాకు చాలా కీలకం. రిపోర్ట్స్ ప్రకారం నిన్న గంటపాటు అహ్మదాబాద్ నెట్స్ లో ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ మెగా మ్యాచుకు గిల్ కోలుకొని మ్యాచు ఆడతాడా లేకపోతే మరింత విశ్రాంతి పేరుతో బెంచ్ కే పరిమితం చేస్తారో చూడాలి.