Hanuman OTT Official: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఇక ఓటీటీ రికార్డ్స్

Hanuman OTT Official:  హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఇక ఓటీటీ రికార్డ్స్

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్(Hanuman) సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లో రిలీజై బాక్సాఫీస్ హిట్ అందుకుంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ వరల్డ్ మూవీగా రిలీజైన హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం..ఎప్పటినుంచో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

లేటెస్ట్గా హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్డేట్ ప్రకటించింది జీ5(Zee5) ఓటీటీ సంస్థ. మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫిసియల్ అనౌన్స్ మెంట్ఇచ్చింది జీ5. అలాగే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉండటంతో..హనుమాన్ రావాల్సిన డేట్కే వస్తుందంటూ తెలిపారు మేకర్స్.

అయితే..హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై మొదటి నుంచి అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామనుకున్నారు. అలాగే మార్చి 1 లేదా 2న వస్తుందని న్యూస్ వినిపించింది. ఇక హనుమాన్ ఆగమనం మహాశివరాత్రి అంటూ మేకర్స్ ప్రకటించాక..ఫ్యాన్స్ భలే ఖుషి అవుతున్నారు. ఇక ఓటీటీ రికార్డ్స్ ఎలా తిరగరాస్తుందో చూడాలి మరి. 

ALSO READ :- Odela 2: ఓదెల 2 మొదలయ్యింది.. వైలెన్స్కి ఈసారి గ్లామర్ తోడయింది

ఇదిలా ఉంటే..హనుమాన్ ఓటీటీ రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది జీ5. పాన్ ఇండియా వైడ్ గా వచ్చిన హనుమాన్ మూవీని మొత్తంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ.11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ.5 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.