బెనెట్ ఫటాఫట్‌‌‌‌‌‌‌‌.. ఒమన్‌‌‌‌‌‌‌‌పై 8 వికెట్లతో జింబాబ్వే గెలుపు

బెనెట్ ఫటాఫట్‌‌‌‌‌‌‌‌.. ఒమన్‌‌‌‌‌‌‌‌పై 8 వికెట్లతో జింబాబ్వే గెలుపు

కొలంబో: బౌలర్ల సమష్టి కృషికి తోడు యంగ్ బ్యాటర్ బ్రియాన్ బెనెట్ (48 నాటౌట్‌‌‌‌‌‌‌‌) మెరుపులతో జింబాబ్వే టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ను భారీ విజయంతో ఆరంభించింది. సోమవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  8 వికెట్ల తేడాతో ఒమన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. తొలుత ఒమన్ 19.5 ఓవర్లలో 103 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. 
వినాయక్ శుక్లా (28), సుఫయాన్ మెహమూద్ (25) టాప్ స్కోరర్లు. ముజారబాని (3/16), రిచర్డ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌గరవ (3/17), బ్రాడ్ ఇవాన్స్ (3/18) మూడేసి వికెట్లతో దెబ్బకొట్టారు. అనంతరం బెనెట్‌‌‌‌‌‌‌‌కు తోడు బ్రెండన్ టేలర్ (31) సత్తా చాటడంతో జింబాబ్వే 13.3 ఓవర్లలోనే  104/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ముజరబానికి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్ అవార్డు లభించింది.