Zoom: ప్రెసిడెంట్ను ఉద్యోగం నుంచి తీసేసిన జూమ్

Zoom: ప్రెసిడెంట్ను ఉద్యోగం నుంచి తీసేసిన జూమ్

వీడియో కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంస్థ జూమ్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  కంపెనీ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ టూంబ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని  కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే గ్రెగ్‌ టాంబ్ తొలగింపునకు ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. మరోవైపు గ్రెగ్ టాంబ్ ను జూన్‌2022లో కంపెనీ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది. కానీ 9 నెలల్లోనే ఉద్యోగంలో నుంచి తీసివేసింది. అటు గ్రెగ్‌ స్థానంలో  మరో వ్యక్తిని ప్రెసిడెంట్ గా ప్రకటించలేదు. ఎప్పుడు అతని స్థానాన్ని భర్తీ చేస్తుందో కూడా కంపెనీ వెల్లడించలేదు. 

2019లో జూమ్‌లో చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌గా గ్రెగ్‌ టాంబ్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ప్రమోషన్‌ రావడంతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూమ్ కంపెనీలోకి రాక ముందు గ్రెగ్‌ టాంబ్.. గూగుల్‌లో విక్రయాలు, వర్క్‌స్పేస్‌, సెక్యూరిటీ, జియోఎంటర్‌ప్రైజ్‌ విభాగాలకు వైస్‌ప్రెసిడెంట్‌గా మే 2021 వరకు కొనసాగారు.  

జూమ్‌ సంస్థ ఫిబ్రవరిలో భారీగా ఉద్యోగస్తులను తొలగించింది. మొత్తం 1,300 మందిని తొలగించిన్నట్లు ప్రకటించింది. ఆ సంస్థలోని 15 శాతం ఉద్యోగస్తులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. అయితే అమెరికాలో ఉద్యోగస్తులను తీసివేస్తే..అక్కడి చట్టం ప్రకారం తమ సిబ్బందికి 16 వారాల పాటు సాలరీ , హెల్త్‌కేర్‌ కవరేజీ, 2023 ఆర్థిక  సంవత్సరానికి సంబంధించిన బోనస్‌, 6 నెలల పాటు స్టాక్‌ ఆప్షన్‌పై అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక  అమెరికాయేతర దేశాల్లోని తమ ఉద్యోగుల కోసం ఆగస్టు 9 వరకు సమయం ఇచ్చారు.