ప్రతి ఓటు కీలకమైనదే

ప్రతి ఓటు కీలకమైనదే

వచ్చే నెల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వారణాసి  బీజేపీ నేతలు, కార్యకర్తలకు ప్రధాని ప్రధాని మోడీ  దిశా నిర్దేశం చేశారు. నమో యప్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా అత్యంత విలువైందన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు విలువ ఏమిటో వివరంగా చెప్పాలని.. వారు ఓటు వేసేలా చూడాలని సూచించారు.
 
రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వారికి వివరించాలని మోడీ చెప్పారు. రసాయనాలు లేని ఎరువుల గురించి వారిలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. వారణాసి ప్రజలకు పెద్ద స్థాయిలో లబ్ధి కలిగించిన పలు కేంద్ర పథకాల గురించి కూడా మాట్లాడారు. వీటన్నింటిని ఓటర్లకు వివరించాలని తెలిపారు. బీజేపీ మైక్రో డొనేషన్ క్యాంపెయిన్ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. పార్టీ ఫండ్స్ కోసం చిన్న మొత్తాల్లో విరాళాలు ఇవ్వాలని కోరారు.  

ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తర్వాత పార్టీ వర్కర్లతో  ప్రధాని మోడీ  మాట్లాడటం ఇది మొదటి సారి.

మరిన్ని వార్తల కోసం..

టెస్టు కెప్టెన్సీపై మనసులోమాట బయట పెట్టిన రాహుల్