భారత వైమానిక దళానికి (IAF) చెందిన గ్రూప్ కెప్టెన్ & వ్యోమగామి శుభాన్షు శుక్లా సరదాగా అన్న మాటలు ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లని ఆకర్షిస్తోంది. విషయం ఏంటంటే గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సభలో శుభాన్షు శుక్లా మాట్లాడుతూ బెంగళూరులోని భయంకరమైన ట్రాఫిక్ గురించి ఒక జోక్ చేశారు.
ఆయన మారతహళ్లి నుంచి సభ జరిగే చోటుకు ప్రయాణించారట. "నేను మా ఇంటికి అవతలి వైపు ఉన్న మారతహళ్లి నుండి ఇక్కడికి వచ్చాను. ఈ చిన్న ప్రయాణానికే మూడు రెట్లు ఎక్కువ సమయం పట్టింది. దీన్ని బట్టి, ఈ కార్యక్రమంపై నాకు ఎంత ఆసక్తి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు" అని నవ్వుతూ అన్నారు.
కొద్ది గంటల తర్వాత, ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా ఈ మాటలను గుర్తుచేసుకుంటూ సరదాగా మాట్లాడారు. శుభాన్షు శుక్లా చెప్పినట్లుగా, ఆయనకు అంతరిక్షం నుంచి బెంగళూరు చేరుకోవడం చాలా తేలిక, కానీ మారతహళ్లి నుంచి ఇక్కడికి (దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్‌కు) రావడం కొంచెం కష్టం అని ఖర్గే అన్నారు. అయితే ఇకపై ఇలా జరగకుండా ఉండేందుకు మేము ప్రయత్నిస్తాం అని హామీ ఇచ్చారు.
