హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సచివాలయంలో ‘స్మార్ట్ సురక్ష ఏఐ’ మొబైల్ యాప్ లోగోను ప్రభుత్వ ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు ఆదివారం ఆవిష్కరించారు. బీఎస్ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థ ఈ ఏఐ ఆధారిత అప్లికేషన్ను రూపొందిస్తోంది.
దీన్ని మూడు నెలల్లో అధికారికంగా విడుదల చేస్తామని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓలు భాను చందర్ గరిగెల, శారదా నేనావత్ తెలిపారు. ఈ యాప్ ద్వారా పౌరులు.. అత్యవసర సహాయం, డిజిటల్ పోలీస్ సేవలు, సమీప పోలీస్ స్టేషన్ వివరాలు పొందవచ్చని, రియల్ టైమ్ భద్రతా హెచ్చరికలు, సేవల ట్రాకింగ్ వంటి అనేక వసతులు ఒకే చోట లభిస్తాయని పేర్కొన్నారు.
