తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్)లో బీటెక్(ఈసీఈ) ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ పెర్కారి శ్రీ చందన ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ హాకథాన్- 5.0లో సత్తా చాటింది. టూవీలర్ వాహనదారుల భద్రత కోసం ఆమె రూపొందించిన ‘స్మార్ట్ వేరబుల్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్’ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి రూ.12 లక్షల గ్రాంట్ మంజూరయింది.
ఈ సందర్భంగా స్టూడెంట్‌కు ప్రశంసలు తెలిపిన కాలేజీ యాజమాన్యం ఇలాంటి జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యాసంస్థల చైర్మన్ జెసాగర్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.అనిల్‌కుమార్, డీన్ అకాడమిక్స్ అండ్ ఆడిట్ డాక్టర్ పీకే వైశాలి స్టూడెంట్‌ను అభినందించారు.
