నిజామాబాద్ జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నిజామాబాద్ జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
  •     ఆర్మూర్​లో హైటెక్ ఫిష్​ మార్కెట్​నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరు        
  •      పీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్ గౌడ్​

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ ​జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పీసీసీ ప్రెసిడెంట్​మహేశ్​ గౌడ్ అన్నారు. జిల్లా మత్స్య సంఘం ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్​లో మహేశ్​ గౌడ్​ను కలిశారు. అర్సపల్లిలోని  ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆర్మూర్​లో చేపల మార్కెట్ ​నిర్మాణం పెండింగ్​లో ఉందని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ డైరెక్టర్​బట్టు సాయిరాం, న్యాలకంటి వాసు పీసీసీ ప్రెసిడెంట్​కు వివరించారు. స్పందించిన ఆయన వెంటనే మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో మట్లాడి సమస్య వివరించి నిధులు మంజూరుకు సిఫారు చేశారు. 

అర్సపల్లిలోని చేపల ఉత్పత్తి కేంద్రం భూమి ఆక్రమణకు గురికాకుండా కాంపౌండ్​ వాల్​ నిర్మాణానికి రూ.77 లక్షలు, ఆధునిక చేపల మార్కెట్ ​నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారని సాయిరాం, వాసు చెప్పారు. నిధులు మంజూరుకు కృషి చేసిన పీసీసీ చీఫ్, మంత్రి వాకిటికి ధన్యవాదాలు తెలిపారు.