బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

పూణె మెట్రో అధికారులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికంగా ఆదాయాన్ని రాబట్టే దిశగా.. టికెట్​ లేకుండా ప్రయాణం చేస్తే రూ. 85లు, స్టేషన్​ లో టికెట్​ కొన్న తరువాత 20 నిమిషాలు దాటి ఉంటే  రూ. 10 నుంచి రూ. 50 వరకు ఫైన్​ఖ విధించేందుకు నిర్ణయం తీసుకుంది.

పూణె మెట్రో అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.  అదనపు ఆదాయాన్ని రాబట్టుకొనేందుకు కొన్ని చర్యలు చేపట్టారు.  పూణె మెట్రోలో టికెట్​లేకుండా ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని అధికారుల దృష్టికి సమాచారం వెళ్లిందని తెలుస్తోంది. దీంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.  టికెట్​ లేకుండా ప్రయాణిస్తున్న వారికి పూణె మెట్రో రూ. 85 లు ఫైన్​ విధించింది.  ఈ విషయాన్ని పూణె మెట్రో సంస్థ తన అధికారిక ట్విట్టర్​ X ద్వారా తెలిపింది.  

అంతే కాకుండా కొంతమంది యూత్​ మెట్రో స్టేషన్లలో సెల్ఫీలు దిగుతూ.. నానా రచ్చ చేస్తున్నారు.  టికెట్​ కొన్న కొన్ని గంటల తరువాత వారు తమ గమ్య స్థానానికి ప్రయాణిస్తున్నారు.  అప్పటి వరకు మెట్రో స్టేషన్లలోనే ఉండి కాలయాపన చేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన​ అధికారులు అలాంటి వారికి చెక్​ పెట్టేందుకు పూణె మెట్రో మరో నిర్ణయం తీసుకుంది.  టికెట్​ కొనుగోలు చేసిన  20 నిమిషాలలోపుగానే వారు ప్రయాణం చేయాలని  సమయం దాటి మెట్రో స్టేషనులో ఉంటే ఫైన్​ విధిస్తామని ప్రకటించింది.  ఈ కాల పరిమితిని గంట మించితే రూ. 10 లు... గరిష్ఠంగా రూ. 50 లు విధిస్తామని పూణె మెట్రో సంస్థ ప్రకటించింది.