హైదరాబాద్, వెలుగు: మహేశ్వరం, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి గురువారం హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంఖుస్ధాపన చేయనుట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. మధ్యాహ్నం 3.00 గంటలకు జల్పల్లిలో ( మహేశ్వరం ), సాయంత్రం 4.00 గంటలకు మైలార్‌దేవ్‌పల్లిలో ( రాజేంద్ర నగర్ ) ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు మంత్రి భూమిపూజ చేస్తారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.
