పదో షెడ్యూల్ను మార్చాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్

పదో షెడ్యూల్ను మార్చాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్

హైదరాబాద్​, వెలుగు: రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ను సవరించాలని మాజీ ఎంపీ, బీఆర్​ఎస్​ సీనియర్​ నేత బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్​ చేశారు. పదో షెడ్యూల్​లోని లొసుగులను అడ్డంపెట్టుకుని ప్రజా ప్రతినిధులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గురువారం ఆయన తెలంగాణభవన్​లో పార్టీ ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు.

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. పదో షెడ్యూల్ లోని చర్యలపై నిర్ణీత గడువు విధించకపోవడంతో స్పీకర్​ ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ చాలా సమయం తీసుకున్నారని, ఈ అంశంపై దాదాపు రెండున్నరేండ్లు వృథా అయిందన్నారు. పదో షెడ్యూల్​లో నిర్ణీత గడువు ఉండి ఉంటే ఇంత సమయం పట్టేది కాదన్నారు.