రామ్ "రెడీ"కి 14 ఏళ్లు..!

రామ్ "రెడీ"కి 14 ఏళ్లు..!

హీరో రామ్ , జెనీలియా కలిసి నటించిన రెడీ సినిమా అప్పట్లో ఎంత కామెడీ పండించిందో అందరికీ తెలిసిందే. రామ్ యాక్షన్, జెనీలియా చిలిపి అల్లరితో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. పాటలు, స్టోరీ చివరి వరకు సస్పెన్స్ తో ఈ మూవీ సక్సెస్ గా నిలిచింది. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న రెడీ సినిమా రిలీజై నేటికి 14 ఏళ్లు. జూన్ 19, 2008లో విడుదలైన ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంది. రామ్ , జెనీలియాతో పాటు ..బ్రహ్మానందం, నాజర్ ,  చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్ , షఫీ ఈ సినిమాలో నటించారు. దేవీశ్రీ మ్యూజిక్ అదరగొట్టగా.. గెట్ రెడీ, మెరె సజనా.. మెరె సజనా, అయ్యో అయ్యో దానయ్య సాంగ్స్ హైలైట్ అయ్యాయి.
 
రెడీ విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. తాను బాగా ఎంజాయ్ చేసిన సినిమా రెడీ అని శ్రీనువైట్ల ట్వీట్ చేశాడు. స్క్రిప్ట్ దశ నుంచి మొదలుకుని రిలీజ్ వరకు ‘రెడీ’ ఫిల్మ్ హ్యాపీగా చేశానని, ఈ సినిమాకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నాడు. ఈ సందర్భంగా హీరో రామ్ కు, హీరోయిన్ జెనీలియా, ప్రొడ్యూసర్ శ్రవంతి రవి కిశోర్ కి థాంక్స్ చెప్పిన శ్రీనువైట్ల..ఫోర్టీన్ ఇయర్స్ ఫర్ రెడీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేస్తూ ఆ నాటి ఫొటోలు షేర్ చేశాడు. 


‘జగడం’ తర్వాత తన వద్దకు వచ్చిన స్టోరి ‘రెడీ’ అని ..అది ఎప్పటికీ స్పెషలేనని హీరో రామ్ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ శ్రీనువైట్లకు, తను వర్క్ చేసిన ఫస్ట్ సూపర్ స్టార్ జెనీలియాకు థాంక్స్ చెప్పాడు. రామ్ పోతినేని ప్రస్తుతం..తమిళ్ దర్శకుడు లింగు స్వామితో ‘ద వారియర్’ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు రామ్. ఇక..దర్శకుడు శ్రీను వైట్ల..‘ఢీ’ కి సీక్వెల్ చేస్తున్నాడు.