ఇవి కూడా చీప్ క్వాలిటీనా.. : చైనా ఎయిర్ క్రాఫ్ట్ కూలి.. ఇద్దరు పైలెట్లు మృతి

ఇవి కూడా చీప్ క్వాలిటీనా.. : చైనా ఎయిర్ క్రాఫ్ట్ కూలి.. ఇద్దరు పైలెట్లు మృతి

చైనా తయారు చేసిన వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుంది.  ఎందుకంటే వాటి ధర తక్కువ.  అందుకే వాటి కోసం జనాలు ఎగబడుతుంటారు.  అయితే చైనాలో తయారయ్యే విమనాలు కూడా ధర తక్కువుగానే ఉంటాయి.  కాస్ట్ తో పాటు క్వాలిటీ కూడా తక్కువుగానే ఉంటుంది.  అయితే ఈ విషయాన్ని ఎవరో కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు.  కాని శ్రీలంక మాత్రం చైనా తయారు చేసిన PT-6 విమానాలను కొనుగోలు చేసింది.  ఇక అంతే వాటిలో పైలట్లకు శిక్షణ ఇస్తారు.  తాజాగా ట్రింకోమలీలో PT-6 విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి చెందారు.   

చైనాలో తయారయిన శ్రీలంక ఎయిర్ క్రాఫ్ట్ PT 6  ట్రింకోమలీలో సోమవారం ( ఆగస్టు7) కూలి ఇద్దరు ట్రైనీ పైలట్లు మరణించినట్లు ఆ దేశ వైమానిక దళ ప్రతినిధి ప్రకటించారు. వైమానిక దళం అకాడమీ నుంచి టేకాఫ్ అయిన తర్వాత శిక్షణ సమయంలో  PT-6 విమానం కూలిపోయినట్లు  గ్రూప్ కెప్టెన్ దుషన్ విజేసింగ్ తెలిపారు.  మరణించిన పైలట్ల మృతదేహాలను  అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం లోతుగా విచారిస్తామని తెలిపింది.  దర్యాప్తునకు ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌  మార్షల్‌ ఉదేని రాజపక్సే నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు కమిటీని నియమించినట్లు విజేసింగ్‌ తెలిపారు. శ్రీలంకలో కొత్త పైలట్లుకు శిక్షణ ఇచ్చేందుకు PT-6 విమానాలను ఉపయోగిస్తారు.