శ్రీనగర్లో నదిలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. ఏడు మంది జవాన్లకు గాయాలు

శ్రీనగర్లో నదిలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. ఏడు మంది జవాన్లకు గాయాలు

శ్రీనగర్ లో కేంద్ర బలగాలతో వెళ్తున్న వాహనం నదిలోకి దూసుకెళ్లింది. అదుపు తప్పి వాహనం నదిలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది.  శనివారం (ఫిబ్రవరి 21) జరిగిన ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు గాయాల పాలయ్యారు. 

ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ లోని అహ్మద్ నగర్ ఔట్ స్కట్స్ సమీపంలో ప్రమాదం జరిగింది. దగ్ పొరా-ఉమెర్హైర్ దగ్గర వాహనం అదుపు తప్పి రివర్ లో పడిపోయింది. డ్రైవర్ కంట్రలో తప్పడంతో వాహనం నీళ్లలోకి దూసుకెళ్లినట్లు అధికారులు చెప్పారు. 

ఈ ప్రమాదంలో ఏడు మంది గాపడ్డారు. ప్రాణాపాయమేమీ లేదని తెలిపారు. గాయపడ్డవారిని సౌరా లోని కిమ్స్ (SKIMS) హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.