ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మరణాలు

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మరణాలు
  • చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి
  • ఇవాళ 18 వేల 285 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 99 మరణాలు నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 15 మంది చనిపోయారు. గత రెండు వారాలుగా చిత్తూరు జిల్లా కరోనా మరణాల్లో ఏపీలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది.  తిరుపతి రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన నాటి నుంచి ఒకటి ఆరా మినహా దాదాపు ప్రతిరోజు 15 మంది చొప్పున మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 
చిత్తూరు జిల్లా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మరణాలు నమోదయ్యాయి. అలాగే విజయనగరంలో 9 మంది, అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో 8 మంది చొప్పున, కర్నూలులో ఆరుగురు, గుంటూరు, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. మరో వైపు గడచిన 24 గంటల్లో 24 వేల 105 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రుల నుండి ఇళ్లకు వెళ్లిపోయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
కేసుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిని 24 గంటల్లో 91 వేల 120 మందికి కరోనా పరీక్షలు చేయగా 18 వేల 285 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.