సూట్ కేసు ఫ్రేముల్లో బంగారం దాచి తరలిస్తూ..

సూట్ కేసు ఫ్రేముల్లో బంగారం దాచి తరలిస్తూ..
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుపడ్డాడు
  • దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు

విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలించే వారు రోజు రోజుకూ తెలివిమీరిపోతున్నారు. కస్టమ్స్ తనిఖీల్లో దొరక్కుండా కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. అనుమానంతో చాలా లోతుగా పరిశీలించి తనిఖీలు చేస్తే తప్ప బయటపడని రీతుల్లో అక్రమ తరలింపులకు పాల్పడుతున్నారు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తూ అనేక మందిని పట్టుకుంటున్నా హస్తలాఘవం ప్రవర్తించే వారు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. తాజాగా శనివారం పట్టుపడిన వ్యవహారం కస్టమ్స్ అధికారులనే ఆశ్చర్యపరచింది. వివరాలు ఇలా ఉన్నాయి. 
శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు రెగ్యులర్ తనిఖీలు చేస్తుండగా.. దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించాడు. సాధారణ తనిఖీల్లో ఏమీ దొరకలేదు. అయినా మరోసారి అతని సూట్ కేసును పరిశీలించగా.. సూట్ కేసు ఫ్రేమ్స్ పెకలించి మళ్లీ అతుకుపెట్టినట్లు కనిపించింది. దీంతో సూట్ కేసు ఫ్రేమ్స్ తొలగించి చూడగా మొత్తం 410 గ్రాముల బంగారం దొరికింది. దొరికిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు వెంటనే  సీజ్ చేశారు.  పట్టుపడిన బంగారం విలువ 20 లక్షలపైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.