రేపు(ఆగస్టు19) రాజ్యసభకు అభిషేక్ సింఘ్వి నామినేషన్ : సీఎం రేవంత్

రేపు(ఆగస్టు19) రాజ్యసభకు అభిషేక్ సింఘ్వి నామినేషన్  : సీఎం రేవంత్

హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని హోటల్ షెరటాన్ లో  పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ భేటీ ముగిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు,  ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీఎల్పీ భేటీలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పాల్గొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులకు రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీని పరిచయం చేశారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా మను సింఘ్విని ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాద తీర్మానం చేసింది సీఎల్పీ. 

అనంతరం మాట్లాడిన రేవంత్.. తెలంగాణ తరపున సింఘ్వి ఎంపీగా ఉండటం శుభపరిణామమన్నారు. తెలంగాణ హక్కుల కోసం సింఘ్వి పోరాడుతారని చెప్పారు.  విభజన హామీల అమలుకు  సింఘ్వి పోరాడుతారన్నారురేవంత్.  

ఆగస్టు 19న 11 గంటలకు కాంగ్రెస్ తరపున   రాజ్యసభ  అభ్యర్థిగా అసెంబ్లీలో నామినేషన్ వేయనున్నారు అభిషేక్ సింఘ్వి. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.